మురసు తుఫాన్ ఎఫెక్ట్.. ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు..
ABN , Publish Date - Nov 03 , 2026 | 07:39 PM
ఆంధ్రప్రదేశ్‌లో మురసు తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్ తీరం దాటినా దాని ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మురసు తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్ తీరం దాటినా దాని ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలాగే తీవ్ర గాలులు వీస్తున్నాయి.
వాతావరణ శాఖ అధికారుల వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా పొన్నూరులో అత్యధికంగా 31.2 సెం.మీ. వర్షపాతం నమోదైంది. గుంటూరులో 30 సెం.మీ., సత్తెనపల్లిలో 17.9 సెం.మీ., తెనాలిలో 17.1 సెం.మీ. వర్షపాతం రికార్డయ్యింది. బాపట్లలో 15.7 సెం.మీ., నరసరావుపేటలో 14.5 సెం.మీ., ఏలూరులో 14.1 సెం.మీ., చీరాలలో 13.5 సెం.మీ. వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
మరోవైపు, తుఫాన్ ప్రభావం ఉన్నప్పటికీ ఏపీలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అయితే, పలు ప్రాంతాల్లో వర్షాలు, తీవ్ర గాలుల కారణంగా కౌంటింగ్‌ను వాయిదా వేసిన పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి
పులివెందుల మున్సిపాలిటీ టీడీపీ కైవసం.. 13,875 ఓట్ల మెజారిటీతో భారీ గెలుపు
నెల్లూరు మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ హవా.. వరుస విజయాలతో వైసీపీకి షాక్