Share News

నెల్లూరు మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ హవా.. వరుస విజయాలతో వైసీపీకి షాక్

ABN , Publish Date - Nov 03 , 2026 | 07:18 PM

నెల్లూరు జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ దుమ్ము లేపుతోంది. వరుసగా సీట్లు కైవసం చేసుకుంటూ వైసీపీకి షాక్ ఇస్తోంది. నెల్లూరు కార్పొరేషన్‌లో 40 వేల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి రూప్ కుమార్ యాదవ్ ముందంజలో ఉన్నారు.

నెల్లూరు మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ హవా.. వరుస విజయాలతో వైసీపీకి షాక్
Nellore Municipal Elections

నెల్లూరు: జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ దుమ్ము లేపుతోంది. వరుసగా సీట్లు కైవసం చేసుకుంటూ వైసీపీకి షాక్ ఇస్తోంది. నెల్లూరు కార్పొరేషన్‌లో 40 వేల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి రూప్ కుమార్ యాదవ్ ముందంజలో ఉన్నారు. ఆత్మకూరు మున్సిపాలిటీని టీడీపీ అభ్యర్థి బొమ్మిరెడ్డి షకీలా కైవసం చేసుకున్నారు. 2,206 ఓట్ల మెజారిటీతో విజయఢంకా మోగించారు.


వెంకటగిరిలో టీడీపీ చైర్‌పర్సన్ అభ్యర్థి దొంతు శారద 10,636 ఓట్లతో గెలుపొందారు. సూళ్లూరుపేటలో టీడీపీ అభ్యర్థి పిట్ల సుహాసిని 8,306 ఓట్ల మెజారిటీతో చైర్‌పర్సన్ పీఠాన్ని దక్కించుకున్నారు. బుచ్చిరెడ్డిపాళెంలో టీడీపీ అభ్యర్థి దొడ్ల విజయలక్ష్మి 3,543 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇక నాయుడుపేటలో వైసీపీ చైర్‌పర్సన్ అభ్యర్థి తంబిరెడ్డి రాజేశ్వరమ్మ 1,473 ఓట్ల ఆధిక్యంలో ఉండగా, మరో 1,400 ఓట్లు లెక్కించాల్సి ఉంది. ఈ క్రమంలో టీడీపీ నేతలు ఆందోళనకు దిగడంతో ఎన్నికల అధికారులు తాత్కాలికంగా కౌంటింగ్‌ను నిలిపివేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

పులివెందుల మున్సిపాలిటీ టీడీపీ కైవసం.. 13,875 ఓట్ల మెజారిటీతో భారీ గెలుపు

జగన్ అడ్డా కడపలో టీడీపీ హవా.. నాలుగు మున్సిపాలిటీలు కైవసం

Updated Date - Nov 03 , 2026 | 07:21 PM