Share News

ఆంధ్రప్రదేశ్ వైపు దూసుకొస్తున్న మురసు తుఫాన్.. అప్రమత్తంగా ఉండాలన్న ప్రఖర్ జైన్..

ABN , Publish Date - Nov 02 , 2026 | 03:05 PM

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాన్ ‘మురసు’ ఆంధ్రప్రదేశ్ వైపు దూసుకొస్తోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. నవంబర్ 2వ తేదీ అర్ధరాత్రి నుంచి నవంబర్ 3వ తేదీ తెల్లవారుజాము మధ్య ఒంగోలు సమీపంలో తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించింది.

ఆంధ్రప్రదేశ్ వైపు దూసుకొస్తున్న మురసు తుఫాన్.. అప్రమత్తంగా ఉండాలన్న ప్రఖర్ జైన్..
Murasu Cyclone

అమరావతి: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాన్ ‘మురసు’ ఆంధ్రప్రదేశ్ వైపు దూసుకొస్తోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపింది. నవంబర్ 2వ తేదీ అర్ధరాత్రి నుంచి నవంబర్ 3వ తేదీ తెల్లవారుజాము మధ్య ఒంగోలు సమీపంలో తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించింది. గత ఆరు గంటలుగా తుఫాన్ గంటకు 14 కిలోమీటర్ల వేగంతో కదులుతోందని పేర్కొంది.


ప్రస్తుతం నెల్లూరుకు 120 కిలోమీటర్లు, కావలికి 140 కిలోమీటర్లు, తిరుపతికి 170 కిలోమీటర్లు, ఒంగోలుకు 180 కిలోమీటర్లు, బాపట్లకు 200 కిలోమీటర్ల దూరంలో తుఫాన్ కేంద్రీకృతమై ఉందని ఏపీఎస్‌డీఎంఏ తెలిపింది. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం 1:30 గంటలకు తుఫాన్ వివరాలతో బులెటిన్‌ను విడుదల చేసింది. మురసు ప్రభావంతో ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ సంస్థ తెలిపింది. అలాగే, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. దక్షిణ కోస్తా, రాయలసీమలోని ఇతర జిల్లాల్లోనూ అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని ఏపీఎస్‌డీఎంఏ పేర్కొంది.


ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఏపీఎస్‌డీఎంఏ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. తుఫాన్ తీరం దాటే సమయంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని, అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని హెచ్చరించారు. మరోవైపు, తుఫాన్ తీరానికి చేరువయ్యే కొద్దీ వాతావరణ పరిస్థితులు మరింత తీవ్రంగా మారే అవకాశం ఉండటంతో, కూటమి ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

‘రాప్తాడు బాలిక ఆరోగ్యం మెరుగుపడుతోంది’.. ఎక్స్‌లో మంత్రి లోకేశ్ పోస్ట్

రాప్తాడు నిందితుడి హెల్త్ అప్‌డేట్.. కుడి కాలు తొలగించే పరిస్థితి రావొచ్చన్న వైద్యులు

Updated Date - Nov 02 , 2026 | 03:40 PM