Share News

బలపడనున్న అల్పపీడనం

ABN , Publish Date - Sep 12 , 2026 | 02:45 AM

నైరుతి రుతుపవనాల సీజన్‌లో తొలిసారిగా అల్పపీడనం ప్రభావంతో ఉత్తరకోస్తాలో వర్షాలు కురుస్తున్నాయి.

బలపడనున్న అల్పపీడనం

  • నేడు ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు

  • దక్షిణ కోస్తాలో మోస్తరు వానలు

విశాఖపట్నం, అమరావతి, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): నైరుతి రుతుపవనాల సీజన్‌లో తొలిసారిగా అల్పపీడనం ప్రభావంతో ఉత్తరకోస్తాలో వర్షాలు కురుస్తున్నాయి. గురువారం ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శుక్రవారం ఉదయానికి ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాకు ఆనుకుని పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించింది. శుక్రవారం సాయంత్రానికి ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు ఆనుకుని సముద్రంలో కొనసాగుతున్న అల్పపీడనం పశ్చిమ వాయవ్యంగా పయనించే క్రమంలో శనివారానికి తీవ్ర అల్పపీడనంగా బలపడనున్నది. ఆ తరువాత ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా మీదుగా ఛత్తీస్‌గఢ్ వైపు పయనించనున్నది.

అల్పపీడనం ప్రభావంతో ఉత్తరకోస్తాలో శుక్రవారం పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం ఎనిమిది గంటల వరకు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు కోస్తాలో ఎక్కువచోట్ల, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

ఈ వార్తలనూ చదవండి...

స్థానిక నాయకత్వం ఆమోదంతోనే చిన్న శ్రీనును పార్టీలోకి తీసుకున్నాం:

ఏపీ 2026-27 ఎక్సైజ్ పాలసీని ప్రకటించిన ఏపీ సర్కార్..

Updated Date - Sep 12 , 2026 | 02:46 AM