Share News

రెయిన్ అలర్ట్.. కోస్తా జిల్లాల్లో ఐదు రోజులపాటు వర్షాలు..

ABN , Publish Date - May 12 , 2026 | 05:36 PM

బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. రానున్న 48 గంటల్లో అల్పపీడనం బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

రెయిన్ అలర్ట్.. కోస్తా జిల్లాల్లో ఐదు రోజులపాటు వర్షాలు..
Rains in Andhra Pradesh

ఇంటర్నెట్ డెస్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. రానున్న 48 గంటల్లో ఇది మరింత బలపడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నారు. కోస్తా జిల్లాల్లో వచ్చే ఐదు రోజుల పాటు వానలు పడే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. రాయలసీమ నుంచి తమిళనాడు, కర్ణాటక వరకు ద్రోణి విస్తరించి ఉందని అధికారులు చెప్పారు.


మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈరోజు ఉదయం 8:30 గంటల సమయానికి అదే ప్రాంతంలో కొనసాగుతోందని ఐఎండీ తెలిపింది. ఇది సముద్ర మట్టానికి సగటున 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకూ విస్తరించి ఉందని వెల్లడించింది. ఇది రాబోయే 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని పేర్కొంది. నైరుతి ప్రాంతం కాకుండా మిగిలిన బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలో వాతావరణం సాధారణంగా ఉంటుందని చెప్పింది. ఈ వారం చివరి నాటికి దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లోని కొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాల ప్రవేశానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయని ఐఎండీ తెలిపింది. ఈ మేరకు ఓ ప్రకటన జారీ చేసింది.


null

ఈ వార్తలు కూడా చదవండి

ట్రాన్స్‌జెండర్ల సంక్షేమానికి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

‘మావిగన్’ అంటూ నీతిలేని వ్యాఖ్యలు మాట్లాడుతున్నారు.. జగన్ అండ్ కోపై మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజం

Updated Date - May 12 , 2026 | 05:59 PM