భాగ్యనగరంలో భారీ వర్షం.. రోడ్లన్నీ జలమయం..
ABN , Publish Date - Oct 30 , 2026 | 06:28 PM
భాగ్యనగర వ్యాప్తంగా వర్షం దంచికొడుతోంది. ఖైరతాబాద్, సోమాజిగూడ, పంజాగుట్ట, లక్డీకాపూల్, మాసబ్ ట్యాంక్, అమీర్‌పేట్, ఎస్‌ఆర్ నగర్, ఎర్రగడ్డ, సనత్ నగర్ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్, నాంపల్లి, మెహదీపట్నం, అత్తాపూర్, టోలిచౌకి ప్రాంతాల్లోనూ కుండపోతగా పడుతోంది.
హైదరాబాద్: భాగ్యనగర వ్యాప్తంగా వర్షం దంచికొడుతోంది. ఖైరతాబాద్, సోమాజిగూడ, పంజాగుట్ట, లక్డీకాపూల్, మాసబ్ ట్యాంక్, అమీర్‌పేట్, ఎస్‌ఆర్ నగర్, ఎర్రగడ్డ, సనత్ నగర్ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్, నాంపల్లి, మెహదీపట్నం, అత్తాపూర్, టోలిచౌకి ప్రాంతాల్లోనూ కుండపోతగా పడుతోంది.

నగరవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. నగరవాసులు ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షం, రోడ్లపై వరద నీరు కారణంగా ప్రయాణానికి తీవ్ర ఆటంకం కలుగుతోంది.

అలాగే, పలువురు ప్రయాణికులు మెట్రో పిల్లర్ల కింద తలదాచుకున్నారు. మరోవైపు, కొన్ని రోజులుగా ఎండలకు ఉక్కిరిబిక్కిరైన ప్రజలకు ఈ వర్షం కాస్త ఉపశమనం కలిగించింది.

ఈ వార్తలు కూడా చదవండి
సికింద్రాబాద్‌లో అండాల అక్రమ సేకరణ గుట్టురట్టు.. అదుపులోకి 10 మంది యువతులు
కేసీఆర్ పాల్పడిన అరాచకానికి ప్రకృతి శిక్షిస్తుంది: సీఎం రేవంత్‌రెడ్డి