బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశం.. ఏపీకి భారీ వర్ష సూచన..
ABN , Publish Date - Oct 02 , 2026 | 07:26 PM
దక్షిణ, మధ్య బంగాళాఖాతం పరిసరాల్లో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఉత్తర అండమాన్ సముద్రంలో అక్టోబర్ 12న ఉపరితల ఆవర్తనం ఏర్పడి, క్రమంగా బలపడే సూచనలు ఉన్నట్లు పేర్కొంది.
అమరావతి: దక్షిణ, మధ్య బంగాళాఖాతం పరిసరాల్లో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) తెలిపింది. ఉత్తర అండమాన్ సముద్రంలో అక్టోబర్ 12న ఉపరితల ఆవర్తనం ఏర్పడి, క్రమంగా బలపడే సూచనలు ఉన్నట్లు పేర్కొంది. అక్టోబర్ 13 నాటికి ఇది అండమాన్ సముద్రంలో అల్పపీడనంగా మారనున్నట్లు తెలిపింది. అనంతరం అక్టోబర్ 15 నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని చెప్పింది. వాయుగుండం దక్షిణ, మధ్య బంగాళాఖాతం పరిసరాల్లో కొనసాగనున్నట్లు వెల్లడించింది. దీనిపై రానున్న రోజుల్లో మరింత స్పష్టత వస్తుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.
పిడుగులతో వర్షాలు..
ఇక శనివారం అల్లూరి, పోలవరం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అక్కడక్కడా పిడుగులతో కూడిన వానలు పడే సూచనలు ఉన్నట్లు హెచ్చరించింది. మిగతా కోస్తా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు.. కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన వానలు కురవనున్నట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
ఈ వార్తలు కూడా చదవండి
విశాఖ తీరంలో విషాదం.. అలల తాకిడికి ముగ్గురు విద్యార్థుల గల్లంతు
గాంధీజీ స్ఫూర్తితోనే స్వచ్ఛాంధ్ర కార్యక్రమం: సీఎం చంద్రబాబు