ఏపీలో వర్షాలు.. ఆ రెండు జిల్లాల ప్రజలకు బిగ్ అలర్ట్
ABN , Publish Date - Aug 20 , 2026 | 05:34 PM
ఆంధ్రప్రదేశ్‌లోని పలు చోట్ల శుక్రవారం వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. పోలవరం, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడతాయని వివరించింది.
అమరావతి, ఆగస్టు20: ఆంధ్రప్రదేశ్‌లోని పలు చోట్ల శుక్రవారం వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. పోలవరం, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడతాయని వివరించింది. ఈ రెండు జిల్లాల్లో పిడుగులు పడతాయని హెచ్చరించింది. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించింది.
ఈ నాలుగు జిల్లాల్లో కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మిగతా కోస్తా జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు పడతాయని చెప్పింది. ఈ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించింది. పిడుగులు పడే సమయంలో సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని ప్రజలకు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి..
అసెంబ్లీకి రాకుండా పారిపోతున్న జగన్: మంత్రి లోకేశ్
ఏసీబీ వలలో ఎమ్మార్వో.. 15 బృందాలతో సోదాలు
For More AP News And Telugu News