ఆంధ్రప్రదేశ్‌లో మండిపోతున్న ఎండలు.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు..
ABN , Publish Date - May 21 , 2026 | 07:31 PM
ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు మండిపోతున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. రాష్ట్రంలో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు హెచ్చరిస్తున్నారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు మండిపోతున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. రాష్ట్రంలో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఈ రోజు (గురువారం) 20 జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 44 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదైనట్లు విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. శుక్రవారం పలు ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు, అధిక ఉష్ణోగ్రతల ప్రభావం చూపే అవకాశం ఉందని వెల్లడించారు. అల్లూరి సీతారామరాజు, పోలవరం, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో 45 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. కాకినాడ, నెల్లూరు జిల్లాల్లో 43 నుంచి 45 డిగ్రీలు, మరికొన్ని జిల్లాల్లో 40 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు.
ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. మంచినీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం వంటివి ఎక్కువగా తాగాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు సూచిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
రాజారెడ్డి హత్య కేసుపై పార్థసారథిరెడ్డి సంచలన వ్యాఖ్యలు.. జగన్‌పై తీవ్ర ఆరోపణలు
గుంటూరు ప్రభుత్వ విద్యార్థులతో ఉపరాష్ట్రపతి భేటీ.. ‘నారీ శక్తి’పై ప్రశంసలు