Share News

ఏపీకి భారీ వర్ష సూచన.. రెండు రోజుల పాటు పిడుగులతో కూడిన వానలు..

ABN , Publish Date - Aug 07 , 2026 | 08:33 PM

ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో రెండు రోజుల పాటు పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో రానున్న 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

ఏపీకి భారీ వర్ష సూచన.. రెండు రోజుల పాటు పిడుగులతో కూడిన వానలు..
AP Weather Update

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో రెండు రోజుల పాటు పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో రానున్న 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ మేరకు వర్షాలకు సంబంధించిన వివరాలను ఆ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. శనివారం ఉత్తరాంధ్రలో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, విశాఖ జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు ఆయన తెలిపారు.


ఈ మేరకు తీరప్రాంతంలో గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ చెప్పారు. తీరప్రాంత ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే ఉత్తర, మధ్య కోస్తాలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఆయన తెలిపారు. పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. కోనసీమ, ఉభయ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు వర్ష సూచన ఉన్నట్లు పేర్కొన్నారు. గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరులో వానలు పడతాయని వెల్లడించారు. అల్లూరి, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో చెదురుమదురుగా.. మార్కాపురం ప్రాంతంతో పాటు రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.


ఈ సందర్భగా ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా పిడుగులతో కూడిన వర్షాల సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్స్ వంటి వాటి వద్ద నిలబడవద్దని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి

90 ఏళ్ల వృద్ధురాలి ఆకాంక్షను నెరవేర్చిన సీఎం చంద్రబాబు..

రాజమండ్రి కారు ప్రమాదంలో డాక్టర్ ప్రియాంక మృతి

Updated Date - Aug 07 , 2026 | 08:40 PM