వైద్య విద్యార్థిని ప్రియాంక ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమం
ABN , Publish Date - Aug 07 , 2026 | 05:40 PM
రాజమండ్రిలో జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన డాక్టర్ ప్రియాంక ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఈ నెల 3న ప్రసాదిత్యమాల్ ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో గాయపడిన ఆమెకు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు.
తూర్పు గోదావరి జిల్లా: రాజమండ్రిలో చోటుచేసుకున్న కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన డాక్టర్ ప్రియాంక ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆమెకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం తర్వాత ఐదు రోజులుగా ఆమెకు చికిత్స కొనసాగిస్తున్నారు.
ఈ నెల 3వ తేదీన రాజమండ్రిలోని ప్రసాదిత్యమాల్ ప్రాంతంలో డాక్టర్ ప్రియాంకను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడగా, కుటుంబ సభ్యులు ఆమెను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి రాజమండ్రికి చెందిన సూరవరపు దస్వంత్, ఆండ్రూ జోసెఫ్ అడ్వర్డ్స్‌లను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వారిని కోర్టులో హాజరుపరిచారు. ప్రియాంక మృతికి కారణమైన సూరవరపు దస్వంత్, ఆండ్రూ జోసెఫ్ అడ్వర్డ్స్‌లకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో నిందితులను జైలుకు తరలించారు.
Also Read:
ఇంట్లో లిల్లీ మొక్క ఉందా? ఈ వాస్తు నియమాలు తప్పక తెలుసుకోండి
వైభవ్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించకుండా ఉండాల్సింది: మాజీ క్రికెటర్ ప్రియాంక్