Share News

ఏపీ ప్రజలకు అలర్ట్.. ఐదు రోజుల పాటు అతి తీవ్ర వడగాలులు..

ABN , Publish Date - May 22 , 2026 | 04:27 PM

ఆంధ్రప్రదేశ్‌లో ఐదు రోజుల పాటు అతి తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు దక్షిణ కోస్తాలోని 8 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు.

ఏపీ ప్రజలకు అలర్ట్.. ఐదు రోజుల పాటు అతి తీవ్ర వడగాలులు..
AP Weather Report

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఎండల తీవ్రతకు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఆందోళనకు గురిచేస్తున్నాయి. పలు జిల్లాల్లో 40 డిగ్రీలకుపైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇదిలా ఉండగా, వాతావరణ శాఖ అధికారులు మరో పిడుగులాంటి వార్త తెలిపారు. ఏపీలో ఐదు రోజుల పాటు అతి తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు.


ఈ మేరకు దక్షిణ కోస్తాలోని 8 జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ నెల 26 వరకు కోస్తాంధ్రలో ఎండల ముప్పు, తీవ్ర వడగాల్పులు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే ఏపీలోని మరో ఆరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మూడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మరోవైపు ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం మినహా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలకు ఐఎండీ, విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మధ్యాహ్న వేళల్లో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని సూచిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

పెన్షన్లపై జగన్‌ అబద్ధపు ప్రచారాలు: మంత్రి కొండపల్లి శ్రీనివాస్

అనంతపురం జిల్లాలో గోల్డ్ మైన్స్‌ గుర్తింపు: మంత్రి కొల్లు రవీంద్ర

Updated Date - May 22 , 2026 | 04:38 PM