తెలంగాణ అబ్బాయి - అమెరికా అమ్మాయి
ABN, Publish Date - Feb 20 , 2026 | 08:47 PM
వివాహ బంధంతో ఓ అమెరికా అమ్మాయి, తెలంగాణ అబ్బాయి ఒక్కటయ్యారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ కి చెందిన ప్రణీత్.. అమెరికాకు చెందిన లవినశ్రీతో వివాహం జరిగింది.
మంచిర్యాల, ఫిబ్రవరి 20: వివాహ బంధంతో ఓ అమెరికా అమ్మాయి, తెలంగాణ అబ్బాయి ఒక్కటయ్యారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ కి చెందిన ప్రణీత్ యూఎస్ఏలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తూ అక్కడే స్థిరపడ్డారు. అమెరికాకు చెందిన లవినశ్రీతో ప్రణీత్‌కి ఓ వివాహ వేడుకలో పరిచయం ఏర్పడింది. వారి స్నేహ బంధం ప్రేమగా మారడంతో ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించారు. ఇవాళ(శుక్రవారం) వీరి వివాహం ఘనంగా జరిగింది. వీరి వివాహానికి అమెరికా నుంచి వధువు బంధువులు హాజరయ్యారు. ఈ వేడుకకు సంబంధించిన పూర్తి వివరాల కోసం పై వీడియోను వీక్షించండి.
Updated at - Feb 20 , 2026 | 08:47 PM