జెన్‌జీపై ఫోకస్ పెట్టండి.. కేంద్ర మంత్రులకు మోదీ క్లాస్!

ABN, Publish Date - May 23 , 2026 | 10:23 AM

సోషల్ మీడియా ప్రభావం రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో యువత ఆలోచనా విధానాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరాన్ని ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రులకు గుర్తుచేసినట్లు సమాచారం. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, జెన్‌జీ తరం, డిజిటల్ ప్రచారంపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

ఇంటర్నెట్ డెస్క్: కేంద్ర మంత్రులతో జరిగిన సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ.. యువత ఆలోచనా విధానం, సోషల్ మీడియా ప్రభావంపై కీలక సూచనలు చేసినట్లు సమాచారం. 'మీకు రీల్స్ తెలుసా? మీలో ఎంతమంది ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్నారు? పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలను సోషల్ మీడియాలో ప్రచారం చేశారా?' అంటూ మంత్రులను ప్రశ్నించిన ఆయన, ప్రస్తుత జెన్‌జీ తరం ఆలోచనలను అర్థం చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. యువతను ఆకట్టుకునేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. వారి ఆలోచనలకు అనుగుణంగా పనితీరును మార్చుకోవాలని, లేకపోతే పరిస్థితులు మిమ్మల్నే మార్చేలా చేస్తాయని మంత్రులకు హెచ్చరించినట్లు సమాచారం.


ఈ వార్తలు కూడా చదవండి:

గోల్డ్ ధరల ర్యాలీకి బ్రేక్.. ప్రస్తుతం రేట్స్ ఎలా ఉన్నాయంటే..

మా వాట్సాప్ గ్రూప్‌లోనూ వైభవ్ గురించే చర్చిస్తున్నాం

Read Latest Telugu News

Updated at - May 23 , 2026 | 10:24 AM