మంత్రి లోకేష్‌పై అనుచిత వ్యాఖ్యలు.. జోగి రమేష్ ఇంటికి నిప్పు..
ABN, Publish Date - Feb 01 , 2026 | 05:35 PM
ఇబ్రహీంపట్నంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జోగి రమేష్ నివాసానికి నిప్పు పెట్టారు టీడీపీ కార్యకర్తలు. మంత్రి లోకేష్‌పై జోగి రమేష్ అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కృష్ణా: ఇబ్రహీంపట్నంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జోగి రమేష్ నివాసానికి నిప్పు పెట్టారు టీడీపీ కార్యకర్తలు. మంత్రి లోకేష్‌పై జోగి రమేష్ అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి లోకేష్‌పై వ్యాఖ్యలకు నిరసనగా జోగి రమేష్ ఇంటిని ముట్టడించారు. మైలవరం నుంచి భారీగా చేరుకున్న టీడీపీ కార్యకర్తలు, అభిమానులు ఆయన ఇంటిపై రాళ్లదాడి చేశారు. దాడి సమయంలో జోగి రమేష్ కుటుంబ సభ్యులెవరూ ఇంట్లో లేరని తెలుస్తోంది.
Updated at - Feb 01 , 2026 | 06:01 PM