హైదరాబాద్‌లో 30శాతం ఓట్లు డిలీట్ చేస్తున్నారా?
ABN, Publish Date - Jul 16 , 2026 | 08:34 AM
SIR ప్రక్రియతో హైదరాబాద్‌లో 30-35 శాతం వరకు ఓట్లు గల్లంతయ్యే పరిస్థితి కనిపిస్తోంది. కొందరికి నగరంలోనే రెండు, మూడు చోట్ల ఓట్లుండగా.. మరి కొందరికి స్వగ్రామాల్లోనూ ఓటు హక్కు ఉండడం గమనార్హం.
SIR ప్రక్రియతో హైదరాబాద్ పరిధిలో ఎన్ని ఓట్లు ఎగిరిపోతాయోనన్న ఆసక్తికర చర్చ ఇప్పుడు నగరవాసుల్లో నడుస్తోంది. ఇప్పటి వరకు క్షేత్రస్థాయిలో జరిగిన సర్వేను పరిశీలిస్తే.. 30-35 శాతం వరకు ఓట్లు గల్లంతయ్యే పరిస్థితి కనిపిస్తోంది. కొందరికి నగరంలోనే రెండు, మూడు చోట్ల ఓట్లుండగా.. మరి కొందరికి స్వగ్రామాల్లోనూ ఓటు హక్కు ఉండడం గమనార్హం. ఈ పరిస్థితుల్లో పెద్ద ఎత్తున ఓటర్ల పేర్లు తొలగించే అవకాశముందని జీహెచ్‌ఎంసీ ఎన్నికల విభాగం వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Updated at - Jul 16 , 2026 | 08:36 AM