గాంధీ భవన్‌లో హై టెన్షన్.. మంత్రుల ముందే కొట్టుకున్న నేతలు

ABN, Publish Date - May 27 , 2026 | 05:22 PM

హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష సమావేశంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రోటోకాల్ అంశంపై కాంగ్రెస్ నేతలు ఫిరోజ్‌ఖాన్, ఉస్మాన్ మధ్య వాగ్వాదం ఘర్షణకు దారితీసింది.

హైదరాబాద్: పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష సమావేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మంత్రులు పొన్నం, అజరుద్దీన్‌ సమక్షంలోనే నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రోటోకాల్ అంశంపై కాంగ్రెస్ నేతలు ఫిరోజ్‌ఖాన్, ఉస్మాన్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మాటామాటా పెరగడంతో ఇద్దరూ పరస్పరం చొక్కాలు పట్టుకుని తోపులాటకు దిగినట్లు తెలుస్తోంది. సమావేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో మంత్రి పొన్నం ప్రభాకర్ జోక్యం చేసుకుని సమావేశాన్ని ముగిసినట్లు ప్రకటించారు. ఈ ఘటనతో సమావేశంలో కొంతసేపు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణలో భారీగా ఎమ్మార్వోలు బదిలీ

నేరం జగన్ నైజం.. గొడ్డలి పార్టీ నెవర్ ఎగైన్.. మహానాడులో సీఎం చంద్రబాబు పంచ్ డైలాగ్స్

For More Telangana News

Updated at - May 27 , 2026 | 06:02 PM