Watch Video: రోడ్డుకు అడ్డంగా పడ్డ లారీ.. భారీ ట్రాఫిక్ జామ్

ABN, Publish Date - Jan 13 , 2026 | 01:50 PM

అబ్దుల్లాపూర్‌మెట్ మండలం ఇనాంగూడ వద్ద కట్టెల లోడ్‌తో వెళ్తున్న లారీ పల్టీ పడింది. రోడ్డుకు అడ్డంగా లారీ పడిపోయింది. లారీలో ఉన్న కట్టెలన్నీ రోడ్డుపై పడ్డాయి. దీంతో హైదరాబాద్-విజయవాడ నేషనల్ హైవేపై భారీగా..

హైదరాబాద్, జనవరి 13: అబ్దుల్లాపూర్‌మెట్ మండలం ఇనాంగూడ వద్ద కట్టెల లోడ్‌తో వెళ్తున్న లారీ పల్టీ పడింది. రోడ్డుకు అడ్డంగా లారీ పడిపోయింది. లారీలో ఉన్న కట్టెలన్నీ రోడ్డుపై పడ్డాయి. దీంతో హైదరాబాద్-విజయవాడ నేషనల్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. సుమారు 6 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఇమామ్ గూడ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు వరకు ట్రాఫిక్ జామ్ అయ్యింది. విషయం తెలుసుకున్న పోలీసులు.. ప్రమాద స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రోడ్డుపై పడిన లారీని, చెక్కలను క్లియర్ చేశారు. ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.

Updated at - Jan 13 , 2026 | 01:50 PM