Hot Air Balloon Show: చెరువులో ల్యాండ్ అయిన హాట్ ఎయిర్ బెలూన్..
ABN, Publish Date - Jan 17 , 2026 | 12:09 PM
హాట్ ఎయిర్ బెలూన్ షోలో అపశృతి చోటు చేసుకుంది. టెక్నికల్ సమస్య కారణంగా ఎయిర్ బెలూన్ చెరువులో ల్యాండ్ అయ్యింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శుక్రవారం నాడు గోల్కొండ నుంచి గండిపేట్ వెళ్లే సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
హైదరాబాద్, జనవరి 17: హాట్ ఎయిర్ బెలూన్ షోలో అపశృతి చోటు చేసుకుంది. టెక్నికల్ సమస్య కారణంగా ఎయిర్ బెలూన్ చెరువులో ల్యాండ్ అయ్యింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శుక్రవారం నాడు గోల్కొండ నుంచి గండిపేట్ వెళ్లే సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బెలూన్‌లో సరైన గాలి లేకపోవడంతో చెరువు మధ్యలో ఎయిర్ బెలూన్ ల్యాండ్ అయ్యింది. హాట్ ఎయిర్ బెలూన్ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. ఇందులో ఉన్నవారందరూ సేఫ్‌గా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
Updated at - Jan 17 , 2026 | 12:13 PM