భారీ వర్షాల ఎఫెక్ట్.. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం

ABN, Publish Date - Jul 21 , 2026 | 03:27 PM

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో సింగరేణి బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. గనుల్లోకి వర్షపు నీరు చేరడంతో బొగ్గు తవ్వకం, రవాణా పనులకు అంతరాయం కలిగింది.

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో సింగరేణి బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా ఓపెన్‌కాస్ట్-2, ఓపెన్‌కాస్ట్-3 గనుల్లో బొగ్గు తవ్వకం, రవాణా పనులు పూర్తిగా నిలిచిపోయాయి. గనుల్లోకి చేరిన వర్షపు నీటిని బయటకు పంపేందుకు అధికారులు భారీ మోటార్లను ఏర్పాటు చేసి సహాయక చర్యలు చేపట్టారు.

Updated at - Jul 21 , 2026 | 03:27 PM