గ్యాస్ సిలిండర్లకు పోలీస్ బందోబస్తు..?

ABN, Publish Date - Mar 14 , 2026 | 09:56 AM

దేశంలో గ్యాస్ కష్టాలు కొనసాగుతున్నాయి. వంట గ్యాస్ సిలిండర్ల కోసం ప్రజలు ఉరుకు పరుగులు పెడుతున్నారు. ముఖ్యంగా పట్టణాలు, నగరాల్లో గ్యాస్ ఏజెన్సీల వద్ద సిలిండర్లతో బారులు తీరుతున్నారు.

దేశంలో గ్యాస్ కష్టాలు కొనసాగుతున్నాయి. వంట గ్యాస్ సిలిండర్ల కోసం ప్రజలు ఉరుకు పరుగులు పెడుతున్నారు. ముఖ్యంగా పట్టణాలు, నగరాల్లో గ్యాస్ ఏజెన్సీల వద్ద సిలిండర్లతో బారులు తీరుతున్నారు. ఇరాన్, అమెరికా యుద్ధం నేపథ్యంలో గ్యాస్ దిగుమతులకు అంతరాయం కలగడంతో వంట గ్యాస్‌కు ఇప్పటికే కొరత ఏర్పడింది. ఇది మరింత తీవ్రమవుతుందేమో అన్న భయంతో జనాలు చాలా మంది ఇళ్లల్లో ఫుల్ గ్యాస్ సిలిండర్లు ఉన్నా.. మరో దాని కోసం బుక్ చేస్తున్నారు. ఆన్‌లైన్ యాప్‌లలో బుకింగ్‌లు కాకపోవడంతో సిలిండర్లతో నేరుగా ఏజెన్సీల వద్దకు వెళ్లి బారులు తీరుతున్నారు. ముందుజాగ్రత్తగా గ్యాస్ సిలిండర్లు రవాణా చేసే వాహనాలకు బందోబస్తు కల్పించాలని ప్రభుత్వం పోలీసులను ఆదేశించింది. పూర్తి వివరాలను వీడియోలో చూడండి..

Updated at - Mar 14 , 2026 | 09:56 AM