కమీషన్ల కోసం కాదు.. పక్కా ప్లాన్ తోనే.!

ABN, Publish Date - Feb 06 , 2026 | 08:20 AM

హిందూమతంపై పకడ్బందీ ప్రణాళిక ప్రకారమే జగన్‌ అండ్‌ కో కుట్ర చేశారని సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో సీబీఐ సిట్‌ రాష్ట్రప్రభుత్వానికి చేసిన సూచనలపై తదుపరి చర్యలకు ఏకసభ్య కమిటీ వేస్తున్నట్లు ప్రకటించారు.

హిందూమతంపై పకడ్బందీగా కుట్ర జరిగిందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. రసాయనాల నెయ్యి.. కమీషన్ల కక్కుర్తితో చేసింది కాదని, తిరుమల పవిత్రతను దెబ్బతీయడమే ఉద్దేశమని చంద్రబాబు పేర్కొన్నారు. జగన్ హయాంలో 219 గుళ్లపై దాడులు జరిగాయన్నారు. భక్తుల మనోభావాలతో ఆడుకున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాటి టీటీడీ చైర్మన్, కొనుగోలు కమిటీకి రసాయనాల నెయ్యి గురించి తెలుసని, దోషులను కఠినంగా శిక్షించడానికి అన్ని చర్యలూ తీసుకుంటామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

Updated at - Feb 06 , 2026 | 08:22 AM