బాణసంచా పేలుడు బాధిత కుటుంబాలకు సీఎం చంద్రబాబు పరామర్శ
ABN, Publish Date - Feb 28 , 2026 | 07:08 PM
కాకినాడ జిల్లా వేట్లపాలెంలో బాణసంచా ప్రమాద స్థలిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించారు. ఈ ఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
కాకినాడ జిల్లా: వేట్లపాలెంలో బాణసంచా ప్రమాద స్థలిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించారు. పేలుడు ఘటన తీరును అధికారులు సీఎంకి వివరించారు. అనంతరం బాణసంచా పేలుడు బాధిత కుటుంబాలను సీఎం చంద్రబాబు పరామర్శించారు. ఈ ప్రమాదంలో 23 మంది మరణించడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.
Updated at - Feb 28 , 2026 | 07:11 PM