జగన్ పీఏ కేఎన్ఆర్ ఆస్తుల చిట్టా..

ABN, Publish Date - Jun 07 , 2026 | 09:24 AM

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పీఏ కె. నాగేశ్వరరెడ్డి (కేఎన్‌ఆర్‌)పై భారీ స్థాయిలో అక్రమ ఆస్తుల ఆరోపణలు వెలుగులోకి వస్తున్నాయి. జగన్‌ అధికారాన్ని అడ్డం పెట్టుకుని వందల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పీఏ కేఎన్‌ఆర్‌పై భారీ భూ అక్రమాలు, ఆస్తుల దోపిడీకి సంబంధించిన ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. అధికార వ్యవస్థలను ఉపయోగించి విశాఖపట్నంలో రూ.250 కోట్ల విలువైన భూమిని స్వాధీనం చేసుకోవడంతో పాటు, విజయవాడలో ఓ రియల్టర్‌ను బెదిరించి వేల గజాల స్థలాన్ని కాజేసినట్లు ఆరోపణలు వెలువడుతున్నాయి. విశాఖ, విజయవాడల్లో భారీ అక్రమాస్తులు కూడబెట్టినట్లు ప్రచారం జరుగుతుండగా, ఈ వ్యవహారంపై దర్యాప్తు సంస్థల దృష్టి సారించినట్లు సమాచారం.

Updated at - Jun 07 , 2026 | 09:28 AM