క్రెడిట్ చోరీపై జగన్ కీలక వ్యాఖ్యలు
ABN, Publish Date - Jan 22 , 2026 | 12:42 PM
భూముల రీసర్వే చేయాలనే ఆలోచన అయినా గతంలో మీకు వచ్చిందా అని సీఎం చంద్రబాబును మాజీ సీఎం జగన్ ప్రశ్నించారు. రీసర్వేకి మూలం ఎక్కడి నుంచి వచ్చిందంటే.. 2019కి ముందు తాను చేపట్టిన పాదయాత్రలో మార్గ మధ్యంలో రైతులు అవస్థలు చూసి.. దీనిని చేపట్టామని వివరించారు.
అమరావతి, జనవరి 22: రీసర్వే మీద సీఎం చంద్రబాబు క్రెడిట్ చోరీ చేస్తున్నారని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ విమర్శించారు. ఈ రీసర్వే అంశంలో అన్ని అవాస్తవాలు చెబుతున్నారంటూ సీఎం చంద్రబాబుపై జగన్ మండిపడ్డారు. గురువారం అమరావతిలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ.. పల్నాడులో ఒక దళితుడిని, వైసీపీ కార్యకర్తను చంపించడంలో సీఎం చంద్రబాబు ఎలాంటి పాత్ర పోషించారో చెబుతానన్నారు. అలాగే ఈ విషయంలో జరుగుతున్న అన్యాయం గురించి చెప్పాల్సి ఉందని పేర్కొన్నారు.
భూముల రీసర్వే చేయాలనే ఆలోచన అయినా గతంలో ఈ చంద్రబాబుకు వచ్చిందా? అని అడుగుతున్నానన్నారు. రీసర్వేకి మూలం ఎక్కడి నుంచి వచ్చిందంటే.. 2019కి ముందు తాను చేపట్టిన పాదయాత్రలో రైతులు అవస్థలు చూశామని గుర్తు చేసుకున్నారు. రైతులు చెప్పిన సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసమే ఈ ఆలోచన పుట్టిందని చెప్పారు. అప్పట్లో రెవెన్యూ శాఖకు సరైన యంత్రాంగం కూడా లేదన్నారు.
సీఎం చంద్రబాబు హయాంలో ఎడాపెడా భూములను 22 ఏలో పెట్టి ఇబ్బందులు పెట్టారని తెలిపారు. అందుకే తాము సమగ్ర భూసర్వే, ల్యాండ్ రిఫార్మ్ చేయాలని నిర్ణయించామని వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు. 2019 మ్యానిఫెస్టోలో ఈ భూ రీసర్వే చేస్తామని ప్రకటించామని వివరించారు. 1923లో బ్రిటిష్ ప్రభుత్వం తరువాత అది కూడా 100 ఏళ్ల అనంతరం తాము ఇచ్చిన హామీ మేరకు ఈ సమగ్ర భూ సర్వేకు శ్రీకారం చుట్టామని మాజీ సీఎం జగన్ చెప్పారు.
ఈ వీడియోలు కూడా వీక్షించండి..
బస్సు , లారీ ప్రమాదం..వెలుగులోకి సంచలన వీడియో
ప్రియుడు మోసం చేశాడంటూ పీఎస్ ముందు యువతి ఆందోళన
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Jan 22 , 2026 | 12:51 PM