లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ విచారణకు మిథున్ రెడ్డి
ABN, Publish Date - Jan 23 , 2026 | 02:23 PM
సిట్ నుండి సేకరించిన సమాచారంతోపాటు వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను పరిగణలోకి తీసుకుని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డితోపాటు మరో ఇద్దరిని ఈడీ విచారిస్తోంది.
హైదరాబాద్, జనవరి 23: ఏపీ మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ పి.మిథున్ రెడ్డితోపాటు శర్వాణి ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌లను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారిస్తున్నారు. సిట్ నుండి సేకరించిన సమాచారంతోపాటు వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను పరిగణలోకి తీసుకుని ఈ ముగ్గురిని ఈడీ విచారిస్తోంది. విజయసాయిరెడ్డిని గురువారం ఈడీ సుదీర్ఘంగా విచారణ జరిపింది. ఈ విచారణలో ఆయన చెప్పిన అంశాలను ఆధారంగా చేసుకుని ఈడీ అధికారులు ఈ ముగ్గురిని ప్రశ్నిస్తున్నారు.
ఈ వీడియోలు కూడా వీక్షించండి..
మంత్రులకు తలనొప్పిగా మారిన మున్సిపల్ ఎన్నికలు.. ?
4 వేలమంది పిల్లలతో..అరుణ్ ఐస్ క్రీమ్ గిన్నిస్ వరల్డ్ రికార్డు
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Jan 23 , 2026 | 02:23 PM