వ్యవసాయ శాఖ అధికారిపై వైసీపీ నేత బూతు పురాణం

ABN, Publish Date - Apr 25 , 2026 | 09:01 AM

ఎన్టీఆర్‌ జిల్లా పెనుగంచిప్రోలు మండలం వెల్దుర్తిపాడుకు చెందిన వైసీపీ నేత బూతు పురాణం తాజాగా బయటపడింది. తన ఫోన్ ఎత్తడం లేదని వ్యవసాయ శాఖ అధికారిపై వైసీపీ నేత వేలాద్రి నోరు పారేసుకున్నాడు.

ఎన్టీఆర్ జిల్లా, ఏప్రిల్ 25: ఏపీలో వైసీపీ నేతల దురాగతాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఎన్టీఆర్‌ జిల్లా పెనుగంచిప్రోలు మండలం వెల్దుర్తిపాడుకు చెందిన వైసీపీ నేత బూతు పురాణం తాజాగా బయటపడింది. తన ఫోన్ ఎత్తడం లేదని వ్యవసాయ శాఖ అధికారిపై వైసీపీ నేత వేలాద్రి నోరు పారేసుకున్నాడు. నందిగామ ఆర్డీవోతోనూ ఫోన్‌లో మాట్లాడుతూ బూతు పురాణం అందుకున్నాడు. వేలాద్రిపై చర్యలు తీసుకోవాలని అధికారులు డిమాండ్ చేస్తున్నారు.

Updated at - Apr 25 , 2026 | 09:09 AM