కేంద్ర ప్రభుత్వం దిగి రావడానికి కారణం ఏంటి.?

ABN, Publish Date - Jul 26 , 2026 | 07:46 AM

మోదీ ప్రభుత్వం అధికారానికి వచ్చిన 12 ఏళ్లలో బహిరంగ రాజకీయ డిమాండ్‌కు తలొగ్గి ఒక కేంద్ర మంత్రి తప్పుకోవడం ఇదే మొదటిసారి. 2015లో అప్పటి హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ‘‘మేం ఎన్డీయే. యూపీఏ కాదు. మా మంత్రులు రాజీనామా చేయరు’’ అన్నారు. ఆ తర్వాత..

మోదీ ప్రభుత్వం అధికారానికి వచ్చిన 12 ఏళ్లలో బహిరంగ రాజకీయ డిమాండ్‌కు తలొగ్గి ఒక కేంద్ర మంత్రి తప్పుకోవడం ఇదే మొదటిసారి. 2015లో అప్పటి హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ‘‘మేం ఎన్డీయే. యూపీఏ కాదు. మా మంత్రులు రాజీనామా చేయరు’’ అన్నారు. ఆ తర్వాత 2018లో ఎంజే అక్బర్‌ రాజీనామా చేసినప్పటికీ అది ఆయన వ్యక్తిగత ప్రవర్తనకు సంబంధించినది. ఆయన రాజీనామా తథ్యమని అందరికీ తెలుసు. తాజాగా ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా మాత్రం ఒక్క రోజులో జరిగింది కాదు.


మే 3 నుంచి జూలై 25 వరకు 84 రోజుల వ్యవధిలో ఒక పరీక్షా వ్యవస్థ వైఫల్యం, ఉదృతంగా సాగిన ఉద్యమం, ప్రభుత్వ వ్యూహం, అధికార పార్టీలో సందిగ్దం.. అన్నీ కలిసి ఈ ముగింపు తీసుకొచ్చాయి. మొదట నీట్‌ ప్రశ్నపత్రం లీక్‌ అయింది. దీంతో పరీక్షను రద్దు చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలన్న డిమాండ్‌ మొదలైంది. ఈ వ్యవహారంలో సీబీఐ 11 మందిని అరెస్టు చేసింది. వివాదం సద్దుమణుగుతోంది అనుకునేలోపు సీబీఎస్ఈ ఫలితాలు వచ్చాయి. కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్‌ స్ర్కీన్‌ మార్కింగ్‌ విధానంలో మసక స్కానింగ్‌, మాయమైన పేజీలు, తారుమారైన జవాబు పత్రాలు.. వెరసి పేపర్ల మూల్యాంకనంలో నిర్లక్ష్యం బయపటడింది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Jul 26 , 2026 | 07:46 AM