రూ.40 కోట్ల సుపారీపై ఈడీ నజర్.. అవినాష్ రెడ్డికి నోటీసులు

ABN, Publish Date - Oct 12 , 2026 | 10:06 AM

మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో రూ.40 కోట్ల సుపారీ ఒప్పందం జరిగినట్లు సీబీఐ నిర్ధారించి ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది.

హైదరాబాద్, అక్టోబర్ 12: మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో రూ.40 కోట్ల సుపారీ ఒప్పందం జరిగినట్లు సీబీఐ నిర్ధారించి ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. ఆ రూ.40 కోట్ల మనీలాండరింగ్ గుట్టురట్టు చేసేందుకు ఈడీ పట్టుబిగించింది. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి?.. ఎవరిచ్చారు?.. ఎవరెవరికి ఇచ్చారు? ఎవరు సమకూర్చారు? హత్యకు ఎవరు రూపకల్పన చేశారు? నిందితులకు డబ్బు ఎలా చేరింది? వంటి అంశాలపై ఈడీ ఫోకస్ పెట్టింది.

Updated at - Oct 12 , 2026 | 10:06 AM