శాంతి ఒప్పందంపై సంతకం చేసిన ట్రంప్
ABN, Publish Date - Jun 18 , 2026 | 09:05 AM
శాంతి ఒప్పందంపై అమెరికా, ఇరాన్ దేశాలు సంతకాలు చేశాయి. బుధవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ శాంతి ఒప్పందంపై డిజిటల్‌గా సంతకాలు చేశారు.
శాంతి ఒప్పందంపై అమెరికా, ఇరాన్ దేశాలు సంతకాలు చేశాయి. బుధవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ శాంతి ఒప్పందంపై డిజిటల్‌గా సంతకాలు చేశారు. నిన్నటి నుంచే శాంతి ఒప్పందం అమల్లోకి వచ్చింది. 3 నెలల పాటు సాగిన యుద్ధం ముగియటంతో పాటు.. అతి త్వరలో హోర్ముజ్ జలసంధి తెరుచుకోనుంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జీ7 సదస్సులో పాల్గొనడానికి ఫ్రాన్స్ వెళ్లారు. బుధవారం ఫ్రాన్స్‌లోని వర్సైల్లెస్ ప్యాలెస్ లోపల శాంతి ఒప్పందంపై సంతకం చేశారు. శాంతి ఒప్పందంపై సంతకం చేసిన విషయాన్ని డొనాల్డ్ ట్రంప్ స్వయంగా మీడియాకు వెల్లడించారు.
ఇవి చదవండి
రోజూ గ్లాసు బీట్‌రూట్ జ్యూస్.. ఎన్నో లాభాలు
స్కూల్‌పై దాడి.. ఎవరూ కావాలని చేయలేదు: ట్రంప్
Updated at - Jun 18 , 2026 | 09:05 AM