ట్రంప్ మరో సంచలనం.. 40 మంది అమెరికా పౌరసత్వాలు రద్దు

ABN, Publish Date - Oct 07 , 2026 | 11:05 AM

ఇటీవల కాలంలో ఎన్నడూ లేని విధంగా అమెరికా ప్రభుత్వం 40 మంది విదేశీయులకు ఇచ్చిన పౌరసత్వాలను రద్దు చేసింది. వీరిలో ఒకరు భారతీయుడు ఉన్నారు.

ఇంటర్నెట్‌ డెస్క్: ఇటీవల కాలంలో ఎన్నడూ లేని విధంగా అమెరికా ప్రభుత్వం 40 మంది విదేశీయులకు ఇచ్చిన పౌరసత్వాలను రద్దు చేసింది. వీరిలో ఒకరు భారతీయుడు ఉన్నారు. మిగిలినవారు నేపాల్, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్‌, మెక్సికో, చైనా, కంబోడియా తదితర దేశాల వారు ఉన్నారు. హత్యల వంటి ఘోరమైన నేరాలు చేయడం, విదేశాలకు ఏజెంట్లుగా పనిచేసి దేశ రహస్యాలను విక్రయించడం, దివ్యాంగుడిపై తీవ్రమైన లైంగిక దాడి చేయడం వంటి ఆరోపణలు కోర్టులో రుజువు కావడంతో అమెరికా ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది.

Updated at - Oct 07 , 2026 | 11:05 AM