ఓఆర్ఆర్‌పై ఘోర ప్రమాదం..

ABN, Publish Date - May 11 , 2026 | 11:26 AM

హైదరాబాద్ ఓఆర్ఆర్ పై మరో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సినీ నటుడు భరత్ కాంత్, కెమెరామన్ త్రిలోక్ మృతి చెందారు.

హైదరాబాద్ ఓఆర్ఆర్ పై మరో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సినీ నటుడు భరత్ కాంత్, కెమెరామన్ త్రిలోక్ మృతి చెందారు. ఇటీవల ఇద్దరూ తమ సొంతూరైన నెల్లూరు వెళ్లారు. శనివారం అక్కడ నుంచి హైదరాబాద్‌కు కారులో బయలుదేరారు. పెద్ద అంబర్‌పేట్‌ దగ్గర ఓఆర్ఆర్ మీదుగా శంషాబాద్ వైపు వెళ్తుండగా.. బెంగళూరు ఎగ్జిట్ దగ్గర వీరు ప్రయాణిస్తున్న కారు ఓ కంటేనర్‌ను ఢీ కొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. తీవ్ర గాయాలు కావడంతో భరత్‌ కాంత్, త్రిలోక్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

Updated at - May 11 , 2026 | 11:39 AM