సైకిళ్లు కావాలంటూ జగ్గారెడ్డి నివాసానికి చిన్నారులు..

ABN, Publish Date - May 21 , 2026 | 09:25 PM

సంగారెడ్డిలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. తమకు సైకిళ్లు కావాలంటూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి నివాసానికి పలువురు చిన్నారులు వెళ్లారు.

సంగారెడ్డి: పట్టణంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. తమకు సైకిళ్లు కావాలంటూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి నివాసానికి పలువురు చిన్నారులు వెళ్లారు. వారిని తన పక్కన కూర్చోపెట్టుకున్న జగ్గారెడ్డి.. చిన్నారుల కోరికను ఆప్యాయంగా విన్నారు. పిల్లల మాటలకు కాసేపు మురిసిపోయారు. అయితే, విద్యార్థుల కోసం ఇప్పటికే పెద్ద సంఖ్యలో సైకిళ్లను బుక్ చేసినట్లు జగ్గారెడ్డి వారికి తెలిపారు. అవి రాగానే అందరికీ ఇస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం చిన్నారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. చిన్నారులతో జగ్గారెడ్డి సంభాషించిన వీడియో సోషల్ మీడియోలో చక్కర్లు కొడుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి

తాగునీటి నాణ్యతపై రాజీ పడొద్దు.. అధికారులకు పవన్ కల్యాణ్ ఆదేశాలు

ఏపీకి భారీ పారిశ్రామిక వరం.. దుగరాజపట్నంలో మెగా షిప్ బిల్డింగ్ క్లస్టర్

Updated at - May 21 , 2026 | 09:29 PM