మద్యం ప్రియులకు షాక్.. తెలంగాణలో పెరగనున్న ధరలు
ABN, Publish Date - Jun 06 , 2026 | 09:50 AM
తెలంగాణలో మద్యం ధరలు పెరగనున్నాయి. పెరిగిన ధరలు ఈనెల 15 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్, జూన్ 6: తెలంగాణలో మద్యం ధరలు పెరగనున్నాయి. పెరిగిన ధరలు ఈనెల 15 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. లిక్కర్ తయారీ కంపెనీల ఒత్తిడి మేరకు ప్రభుత్వం మద్యం ధరలను పెంచడానికి సిద్ధమైనట్లు సమాచారం. ముడి సరుకుల ధరలు, రవాణా ఖర్చులు బాగా పెరిగిన నేపథ్యంలో మద్యం ధరలను కూడా పెంచాలని లిక్కర్ కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.
Updated at - Jun 06 , 2026 | 09:58 AM