నిజాం పాలనను ఎదిరించిన గడ్డ తెలంగాణ: ఉపరాష్ట్రపతి
ABN, Publish Date - Sep 17 , 2026 | 12:35 PM
నిజాం పాలనను ఎదిరించిన గడ్డ తెలంగాణ అని ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ అన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 17: నిజాం పాలనను ఎదిరించిన గడ్డ తెలంగాణ అని ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ అన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ వేడుకలు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరై.. తెలంగాణ పోరాట యోధులకు నివాళులర్పించారు. జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సర్దార్ వల్లబాయి పటేల్ కృషితో హైదరాబాద్ భారత్‌లో విలీనమైందన్నారు. దేశ భద్రతకు కేంద్రం తొలి ప్రాధాన్యం ఇస్తోందని ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ తెలిపారు. ఈ వేడుకలకు కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు హాజరయ్యారు.
Updated at - Sep 17 , 2026 | 12:38 PM