తెలుగు రాష్ట్రాల ర్యాపిడ్ ఫైర్ న్యూస్.. టాప్ అప్‌డేట్స్..
ABN, Publish Date - Feb 27 , 2026 | 07:40 AM
ప్రకృతిని ఆరాధించటం.. నీటిని పూజించే సంప్రదాయం మనదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గోదావరికి అఖండ హారతి, కృష్ణకు పవిత్ర హారతి ఇచ్చామని గుర్తు చేస్తూ.. నదులను పూజించటం సంప్రదాయంగా పెట్టుకున్నామని తెలిపారు.
ప్రకృతిని ఆరాధించటం.. నీటిని పూజించే సంప్రదాయం మనదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గోదావరికి అఖండ హారతి, కృష్ణకు పవిత్ర హారతి ఇచ్చామని గుర్తు చేస్తూ.. నదులను పూజించటం సంప్రదాయంగా పెట్టుకున్నామని తెలిపారు. తాగునీటి రంగంపై సీఎం చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడారు. గంగా, కావేరి అనుసంధానం కావాలనేది తన ఆకాంక్ష అని చెప్పారు. ఏ పనైనా చిన్న ఆలోచనతోనే మొదలవుతుందని చెప్పారు. గంగా, కావేరి అనుసంధానం సాధ్యాసాధ్యాలపై ఆనాడే చర్చలు జరిగాయని అన్నారు. నదులను అనుసంధానం చేసి జల హారతి ఇచ్చే బాధ్యత తమదేనని సీఎం స్పష్టం చేశారు. ఇలాంటి మరిన్ని ర్యాపిడ్ ఫైర్ న్యూస్ కోసం వీడియో చూడండి..
ఇవి కూడా చదవండి
పెరిగిన పచ్చిమిర్చి..తగ్గిన టమాటా
మారుతున్న పులుల స్వభావం.. మనుషులే టార్గెట్‌గా దాడులు..
Updated at - Feb 27 , 2026 | 07:44 AM