క్యూర్ పాలనా వ్యవస్థ సిద్ధం!
ABN, Publish Date - Jul 07 , 2026 | 09:12 AM
హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్)లో అత్యంత కీలకమైన పాలనా వ్యవస్థకు రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసింది. క్యూర్ అపెక్స్ గవర్నెన్స్ కౌన్సిల్ , ఎగ్జిక్యూటివ్ కమిటీల ఏర్పాటుకు నిర్ణయించింది.
హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్)లో అత్యంత కీలకమైన పాలనా వ్యవస్థకు రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసింది. క్యూర్ అపెక్స్ గవర్నెన్స్ కౌన్సిల్ , ఎగ్జిక్యూటివ్ కమిటీల ఏర్పాటుకు నిర్ణయించింది. ఈ మేరకు క్యూర్ బిల్లులో వీటికి సంబంధించిన వివరాలు వెల్లడించింది. దీని ప్రకారం.. ఈ రెండు కమిటీలు భవిష్యత్తులో హైదరాబాద్ మహానగర అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, ట్రాఫిక్, విపత్తుల నిర్వహణ, విద్యుత్, తాగునీరు, రవాణా, మునిసిపల్ సేవలు వంటి కీలక రంగాలపై ఉమ్మడి నిర్ణయాలు తీసుకునే అత్యున్నత వేదికలుగా పని చేస్తాయి. క్యూర్ అపెక్స్ గవర్నెన్స్ కౌన్సిల్‌కు ముఖ్యమంత్రి చైర్మన్‌గా, మునిసిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి సభ్యుడిగా, అదే శాఖ ముఖ్య కార్యదర్శి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు.
ఇవి చదవండి
కౌంటర్లు క్లోజ్.. మెట్రోలో డిజిటల్ టికెట్లే..
ఫిఫా ప్రపంచ కప్: ఫలించని ట్రంప్ జోక్యం.. టోర్నీ నుంచి అమెరికా ఔట్
Updated at - Jul 07 , 2026 | 09:12 AM