రోడ్డెక్కిన ఆర్టీసీ కార్మికులు..
ABN, Publish Date - Apr 22 , 2026 | 09:34 AM
తెలంగాణలో ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. సమస్యలు పరిష్కరించాలంటూ ఆర్టీసీ జేఏసీ సమ్మె బాట పట్టింది. మంగళవారం నాడు అధికారులతో చర్చలు విఫలం కావడంతో ఆందోళనకు దిగారు ఆర్టీసీ కార్మికులు.
ఖమ్మం: తెలంగాణలో ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. సమస్యలు పరిష్కరించాలంటూ ఆర్టీసీ జేఏసీ సమ్మె బాట పట్టింది. మంగళవారం నాడు అధికారులతో చర్చలు విఫలం కావడంతో ఆందోళనకు దిగారు ఆర్టీసీ కార్మికులు. బస్సులను డిపోలకే పరిమితం చేసి రోడ్లపై బైఠాయించి నిరసనలకు దిగారు. సమస్యలు పరిష్కరించే వరకూ సమ్మె విరమించేది లేదని తేల్చి చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం సమ్మె విరమించాలని కార్మికులను కోరుతోంది. ప్రయాణికుల ఇబ్బందుల దృష్ట్యా బస్సులు నడపాలని సంబంధిత ఉన్నతాధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలం: ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి
ఆర్టీసీ బస్సులు బంద్.. మెట్రో రైళ్లు, ఆటోలకు పెరిగిన డిమాండ్..
Updated at - Apr 22 , 2026 | 09:36 AM