తెలంగాణలో భానుడి ప్రతాపం.. నిజామాబాద్‌లో 46 డిగ్రీల రికార్డ్ ఉష్ణోగ్రత
ABN, Publish Date - May 03 , 2026 | 07:30 AM
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండటంతో జనం బయటకు రావాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. ఈ వేసవి కాలంలోనే అత్యధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది.
ఆంధ్రజ్యోతి, మే 3: తెలంగాణ వ్యాప్తంగా ఈ వేసవి కాలంలోనే అత్యధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు తాజాగా నమోదవుతున్నాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్‌లో ఇదే అత్యధిక రికార్డ్ అని అధికారులు చెబుతున్నారు. నల్గొండ, నిర్మల్, సిద్దిపేట జిల్లాల్లో కూడా ఎండ తీవ్రత అధికంగా ఉంది. రాజధాని హైదరాబాద్‌లో కూడా ఎండలు ముదురుతున్నాయి. నగరంలోని ముషీరాబాద్, విఠల్ వాడి ప్రాంతాల్లో 42.5 నుంచి 42.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, రేపు కూడా ఇదే స్థాయిలో ఎండలు కొనసాగే అవకాశం ఉంది. అయితే, ఎల్లుండి నుంచి ఉష్ణోగ్రతలు కొంతమేర తగ్గే అవకాశం ఉందని అంటున్నారు.
Updated at - May 03 , 2026 | 07:40 AM