బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుని లాక్కెళ్లిన మార్షల్స్..
ABN, Publish Date - Sep 08 , 2026 | 08:30 PM
తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను సస్పెన్షన్ చేయడంతో శాసన మండలి మీడియా పాయింట్ వద్దకు వారు చేరుకున్నారు. ఈ సందర్భంగా తాతా మధు మాట్లాడేందుకు ప్రయత్నించగా మార్షల్స్ అడ్డుకున్నారు.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మంత్రి శ్రీధర్‌బాబు ప్రవేశపెట్టిన తీర్మానంతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డి సస్పెన్షన్‌కు గురయ్యారు. దీంతో పెద్దఎత్తున దుమారం రేగింది. శాసన మండలి మీడియా పాయింట్ వద్దకు చేరుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా తాతా మధు మాట్లాడేందుకు ప్రయత్నించగా.. మార్షల్స్ అడ్డుకున్నారు. సస్పెన్షన్ వేటు పడినందున మాట్లాడకూడదంటూ లాక్కెళ్లారు. దీంతో అక్కడంతా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి
స్కూల్ బస్సు కింద పడి రెండేళ్ల చిన్నారి మృతి.. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న కుటుంబీకులు..
తాతా మధు, నవీన్ రెడ్డిపై చర్యలకు తీర్మానం.. అసెంబ్లీ
Updated at - Sep 08 , 2026 | 09:21 PM