తిరుపతి జిల్లా తలకోనలో ఏనుగు హల్‌చల్

ABN, Publish Date - Jun 05 , 2026 | 04:00 PM

తిరుపతి జిల్లా తలకోన సమీపంలో ఒంటరి ఏనుగు హల్‌చల్ చేసింది. గుంపులో నుంచి రోడ్డుపైకి వచ్చిన ఓ గజరాజు భయాందోళనలు సృష్టించింది.

తిరుపతి: తలకోన సమీపంలో ఒంటరి ఏనుగు హల్‌చల్ చేసింది. తలకోనకు వెళ్లే మార్గంలోని చెక్‌పోస్టు దగ్గర ఏనుగుల గుంపు తిష్ట వేసింది. అయితే, గుంపులో నుంచి రోడ్డుపైకి వచ్చిన ఓ గజరాజు భయాందోళనలు సృష్టించింది. ఘీంకరిస్తూ ప్రయాణికులు, వాహనదారులపైకి దూసుకెళ్లే ప్రయత్నం చేసింది. దీంతో వచ్చిన మార్గంలోనే వాహనదారులు భయంతో పరుగులు తీశారు. దీన్ని వీడియో తీసిన కొంత మంది స్థానికులు సోషల్ మీడియాలో పోస్టు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

వైసీపీ నేత బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్.. హైదరాబాద్‌ తరలింపు

ఏపీ అభివృద్ధి చెందితే భారత్ అభివృద్ధి చెందుతుంది: సీఎం చంద్రబాబు..

Updated at - Jun 05 , 2026 | 04:08 PM