తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో భారీ ఊరట
ABN, Publish Date - Jul 29 , 2026 | 05:56 PM
తెలంగాణలోని పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్, గౌరవెల్లి రిజర్వాయర్ వంటి కీలక సాగునీటి ప్రాజెక్టులకు సుప్రీంకోర్టు భారీ ఉపశమనం కల్పించింది.
తెలంగాణలోని పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్, గౌరవెల్లి రిజర్వాయర్ వంటి కీలక సాగునీటి ప్రాజెక్టులకు సుప్రీంకోర్టు భారీ ఉపశమనం కల్పించింది. కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ 2021లో జారీ చేసిన ఆఫీస్ మెమోరాండం (OM)ను సుప్రీంకోర్టు కొట్టివేసినా, ఆ ఉత్తర్వు ఆధారంగా ఇప్పటికే మంజూరైన పర్యావరణ అనుమతులన్నీ పూర్తిగా చెల్లుబాటులోనే ఉంటాయని స్పష్టం చేసింది. ఈ తీర్పు భవిష్యత్తుకు మాత్రమే వర్తిస్తుందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.
పూర్తి వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated at - Jul 29 , 2026 | 05:56 PM