భక్తులతో కిటకిటలాడిన శ్రీశైలం..
ABN, Publish Date - Feb 15 , 2026 | 08:03 AM
శ్రీశైలంలో మహా శివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామివారి దర్శించుకునేందుకు తరలివచ్చిన భక్తులతో శ్రీశైల క్షేత్రం కిటకిటలాడుతోంది. భక్తులు తెల్లవారుజాము నుంచే స్వామి, అమ్మవార్లను దర్శించుకుంటున్నారు.
నంద్యాల: శ్రీశైలంలో మహా శివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామివారి దర్శించుకునేందుకు తరలివచ్చిన భక్తులతో శ్రీశైల క్షేత్రం కిటకిటలాడుతోంది. భక్తులు తెల్లవారుజాము నుంచే స్వామి, అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. ఇవాళ(ఆదివారం) సాయంత్రం 5 గంటలకు శ్రీస్వామి, అమ్మవార్లకు ప్రభోత్సవం నిర్వహిస్తారు. రాత్రి 7 గంటలకు మల్లికార్జునస్వామికి జగద్గురు పీఠాధిపతి అభిషేకం చేయనున్నారు. రాత్రి 10 నుంచి 12 వరకు మల్లన్న ఆలయానికి పాగాలంకరణ కార్యక్రమం చేస్తారు. పాగాలంకరణ సమయంలో మల్లికార్జునస్వామికి విశేష అభిషేకాలు నిర్వహిస్తారు. అలాగే ఏకాదశ రుద్రాభిషేకాన్ని నిర్వహించనున్నారు ఆలయ అర్చకులు. రాత్రి 12 గంటలకు స్వామి, అమ్మవార్లకు వైభవంగా బ్రహ్మోత్సవ కల్యాణం నిర్వహిస్తారు.
Updated at - Feb 15 , 2026 | 08:03 AM