కేరళ వ్యక్తికి సౌదీలో మరణశిక్ష..రూ.34 కోట్లు చెల్లించి విడుదల

ABN, Publish Date - May 30 , 2026 | 04:24 PM

తమ వారికి ఆపద వస్తే వారిని కాపాడుకునేందుకు ఎంత దూరమైనా వెళ్తామని కేరళ సమాజం మరోసారి నిరూపించింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 34 కోట్ల రూపాయలు సేకరించి చావుకు దగ్గరైన ఓ మళయాళీని కాపాడింది. ఇంతకీ ఎవరా వ్యక్తి? ఆ వ్యక్తికి వచ్చిన కష్టమేంటి.?

ఇంటర్నెట్ డెస్క్: రెండు దశాబ్దాల పాటు సౌదీ జైల్లో మగ్గిపోయిన ఓ మళయాళీ మరణశిక్ష ముప్పు తప్పిపోయాక ఎట్టకేలకు భారత్‌కు చేరుకున్నాడు. ఎయిర్‌పోర్టులో ఆయన్ను చూసి తల్లి భావోద్వేగంతో కన్నీరు పెట్టుకున్నారు. కోజికోడ్‌కు చెందిన అబ్దుల్ రహీమ్.. తన కుటుంబానికి అండగా ఉండేందుకు 2006 నవంబర్‌లో డ్రైవర్ వీసాతో సౌదీ వెళ్లారు. అక్కడ ఓ దివ్యాంగుడి బాధ్యతలను కుటుంబ పెద్దలు రహీమ్‌కు అప్పగించారు. అయితే.. రహీమ్ కారణంగా అనుకోకుండా ఓ రోజు ఆ దివ్యాంగుడు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రహీమ్‌కు మరణశిక్ష విధించింది అక్కడి న్యాయస్థానం. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా మళయాళీలంతా ఏకమై ఆయన్ను కాపాడారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను వీక్షించండి.


ఇవీ చదవండి:

వైభవ్‌ అతి త్వరలో జాతీయ జట్టుకు ఎంపికవుతాడు: సంగక్కర

రెండోసారి హిట్ వికెట్.. సాయి సుదర్శన్ స్పందనిదే..

Updated at - May 30 , 2026 | 04:25 PM