కోనసీమ జిల్లాలో ఘనంగా సంక్రాంతి సంబరాలు

ABN, Publish Date - Jan 12 , 2026 | 01:54 PM

కోనసీమలో సంక్రాంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇక, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి.

కోనసీమలో సంక్రాంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇక, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఈ సంబరాల్లో భాగంగా మూడు రోజుల పాటు వివిధ రకాల పోటీలు నిర్వహించనున్నారు. జాతీయ స్థాయి పడవల పోటీలు జరగనున్నాయి. అంతేకాదు.. కోనసీమ రుచులు గురించి తెలుపుతూ ఫుడ్ ఫెస్టివల్ కూడా జరగనుంది. తొలిరోజు ఈత పోటీలు, రంగవల్లులు, ఫుడ్ ఫెస్టివల్ ఆకట్టుకుంటున్నాయి. జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్, ఎస్పీ రాహుల్ మీనా, ఎమ్మెల్యే బండారు సత్యనందరావు పోటీలను ప్రారంభించారు.


ఇవి చదవండి

బెంగళూరు-విజయవాడ హైవే.. నాలుగు గిన్నీస్ రికార్డులు..

పామర్రులో వీరంగం.. ఇద్దరు జర్నలిస్టులు అరెస్ట్

Updated at - Jan 12 , 2026 | 01:54 PM