వచ్చేసారీ నేనే సీఎం.. కాంగ్రెస్ సీనియర్ల గుసగుసలు

ABN, Publish Date - May 21 , 2026 | 10:11 AM

వచ్చే ఎన్నికల తర్వాత కూడా తానే పాలన చేస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే చేస్తోన్న ప్రకటనలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. టీపీసీసీ సీనియర్లతో పాటు కొందరు మంత్రులు దీనిపై మౌనంగా ఉండటంతో రకరకాల చర్చలు సాగుతున్నాయి.

హైదరాబాద్, మే 21: వచ్చే ఎన్నికల తర్వాత కూడా తానే పాలన చేస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే చేస్తోన్న ప్రకటనలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. టీపీసీసీ సీనియర్లతో పాటు కొందరు మంత్రులు దీనిపై మౌనంగా ఉండటంతో రకరకాల చర్చలు సాగుతున్నాయి. కాంగ్రెస్ అధిష్ఠానం అండతోనే రేవంత్ రెడ్డి ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారా.. దీనిపై కొందరు మంత్రులు ఆగ్రహంతో రగిలిపోతున్నారా.. తమకు రావాల్సిన అవకాశాలకు గండి కొడుతున్నారని మండిపడితున్నారా.. ముందునుంచే కాళ్లకు బంధం వేస్తున్నారని కోపంగా ఉన్నారా.. రేవంత్ రెడ్డి వ్యవహారంపై అంతర్గతంగా కాంగ్రెస్ నేతల్లో జరుగుతోన్న చర్చేంటి.

Updated at - May 21 , 2026 | 10:11 AM