ఆంధ్రప్రదేశ్‌కు రేర్ ఎర్త్ కారిడార్

ABN, Publish Date - Feb 02 , 2026 | 10:26 AM

కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో ఏపీలో రేర్ ఎర్త్ కారిడార్‌ నెలకొల్పుతామని ఆదివారం ప్రకటించిన కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.  పూర్వోదయలో భాగంగా సమగ్ర ఈస్ట్‌ కోస్ట్‌ పారిశ్రామిక కారిడార్‌ను అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్టు తెలిపారామె.

ఇంటర్నెట్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో రేర్‌ ఎర్త్ కారిడార్‌ నెలకొల్పుతామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆదివారం ప్రకటించారు. ఈ మేరకు పూర్వోదయ పథకం కింద ఏపీ సహా ఐదు పూర్వోదయ రాష్ట్రాల్లో సమగ్ర ఈస్ట్‌ కోస్ట్‌ పారిశ్రామిక కారిడార్‌ను అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌లో భాగంగా ఉన్న ఈ కారిడార్‌ కోల్‌కతా నుంచి కన్యాకుమారి వరకు 2,500 కిలోమీటర్ల మేర విస్తరించింది. కేంద్రం ప్రకటించిన ఏడు హైస్పీడ్‌ కారిడార్లలో హైదరాబాద్‌-బెంగళూరు, హైదరాబాద్‌-చెన్నై, చెన్నై-బెంగళూరు కారిడార్ల వల్ల ఆంధ్రప్రదేశ్‌కు కీలక ప్రయోజనాలు సమకూరనున్నాయి. విజయవాడ, అమరావతికి అనుసంధానం చేసే హైదరాబాద్‌-చెన్నై హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ రాష్ట్రానికి ఇతోధికంగా ప్రయోజనం కలిపిస్తుందని భావిస్తున్నారు.


ఇవీ చదవండి:

జోగి రమేష్‌పై కేసు నమోదు

టీ20 వరల్డ్ కప్: భారత్‌తో ఆడమన్న పాకిస్థాన్.. ఐసీసీ స్పందన ఇదే..

Updated at - Feb 02 , 2026 | 10:43 AM