మద్యంమత్తులో లావణ్య హల్‌చల్.. కేసు నమోదు..
ABN, Publish Date - Mar 26 , 2026 | 06:40 AM
నటుడు రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య హల్‌చల్ చేశారు. మద్యం మత్తులో పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సంగారెడ్డి మల్లేపల్లి వద్ద కారుతో ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టారు లావణ్య.
సంగారెడ్డి: నటుడు రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య హల్‌చల్ చేశారు. మద్యం మత్తులో పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సంగారెడ్డి మల్లేపల్లి వద్ద కారుతో ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టారు లావణ్య. అనంతరం పారిపోతుండగా కార్లను మల్లేపల్లి గ్రామస్థులు అడ్డుకున్నారు. గ్రామస్థులతో వాగ్వాదానికి దిగడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకోవడంతో వారితోనూ వాగ్వాదానికి దిగారు ఆమె. దీంతో లావణ్యకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేశారు. పాజిటివ్ రావడంతో కేసు నమోదు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
Updated at - Mar 26 , 2026 | 06:41 AM