పెట్రో ధరలు పెరగవని చెప్పలేను: కేంద్ర మంత్రి
ABN, Publish Date - May 13 , 2026 | 10:45 AM
పెట్రోలియం ఉత్పత్తి ధరలు పెరగవని తాను చెప్పనని కేంద్ర పెట్రోలియం మంత్రి హర్‌దీప్ సింగ్ పూరీ అన్నారు. నాలుగేళ్లుగా వీటి ధరలు పెంచలేదని చెప్పారు.
న్యూఢిల్లీ, మే 13: పెట్రోలియం ఉత్పత్తి ధరలు పెరగవని తాను చెప్పనని కేంద్ర పెట్రోలియం మంత్రి హర్‌దీప్ సింగ్ పూరీ అన్నారు. నాలుగేళ్లుగా వీటి ధరలు పెంచలేదని చెప్పారు. ఇంధన సంక్షోభం ఉన్నా ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే పెట్రో ధరలను పెంచలేదన్న విమర్శలను తోసిపుచ్చారు. చివరి సారి 2022లో ధరలు సవరించామని.. ఆ తరువాత కూడా లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు జరిగాయని కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్ పూరీ గుర్తుచేశారు.
Updated at - May 13 , 2026 | 10:55 AM