'ప‌ద్మ' అవార్డులు.. ఏపీకి 4, తెలంగాణ‌కు 7

ABN, Publish Date - Jan 25 , 2026 | 08:42 PM

కేంద్ర ప్రభుత్వం ఆదివారం నాడు పద్మ అవార్డులను ప్రకటించింది. ఈసారి 5 గురికి పద్మ విభూషణ్, 13 మందికి పద్మ భూషణ్, 113 మందికి పద్మశ్రీ అవార్డులు బహుకరించనుంది.

కేంద్ర ప్రభుత్వం ఆదివారం నాడు పద్మ అవార్డులను ప్రకటించింది. ఈసారి ఐదుగురికి పద్మ విభూషణ్, 13 మందికి పద్మ భూషణ్, 113 మందికి పద్మశ్రీ అవార్డులు బహుకరించనుంది. పద్మశ్రీ వచ్చిన వారిలో 11 మంది తెలుగు వారు ఉన్నారు. చంద్రమౌళి గద్దమనుగు (తెలంగాణ), దీపికా రెడ్డి ( తెలంగాణ), గద్దెబాబు రాజేంద్ర ప్రసాద్ (ఆంధ్రప్రదేశ్), గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ (ఆంధ్రప్రదేశ్), గూడూరు వెంకట్ రావు (తెలంగాణ), కృష్ణమూర్తి బాలసుబ్రమణియన్ (తెలంగాణ), కుమారస్వామి తంగరాజ్ (తెలంగాణ), మాగంటి మురళీమోహన్ (ఆంధ్రప్రదేశ్) పాల్కొండ విజయ్ ఆనంద్ రెడ్డి (తెలంగాణ), రామారెడ్డి మామిడి (తెలంగాణ), వెంపటి కుటుంబ శాస్త్రి (ఆంధ్రప్రదేశ్)లు పద్మశ్రీ అవార్డులకు ఎంపికయ్యారు. వీరిలో ఏపీకి చెందిన వారు నలుగురు, తెలంగాణకు చెందిన వారు 7 మంది ఉన్నారు.


ఇవి చదవండి

తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి గ‌ణ‌తంత్ర దినోత్స‌వ‌ శుభాకాంక్ష‌లు..

తెలంగాణలో పోలీసు అధికారుల బదిలీలు

Updated at - Jan 25 , 2026 | 09:00 PM